సినిమా వార్తలు

ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి


7 months ago ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి

ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న‌ ప్రియదర్శి ద‌ర్శ‌కునిగా మార‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఓ పక్క పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తూనే  చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడని స‌మాచారం. ప్రియదర్శి స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. `పెళ్లి చూపులు`తో ప్రియదర్శికి బ్రేక్ ఇచ్చింది త‌రుణ్ భాస్క‌ర్‌. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటిస్తున్న `మిఠాయి` ఆడియోకి అతిథిగా వచ్చిన తరుణ్ భాస్కర్ “నేను యాక్టర్ అయ్యానని ఏడిపిస్తున్నారు. ప్రియదర్శి త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు“ అన్నాడు. అతడు చెప్పేటప్పుడు కాదన్నట్టు సైగలు చేసిన ప్రియదర్శి, తరవాత స్పీచ్‌లో తరుణ్ భాస్కర్ మాటలను ఖండించలేదు స‌రిక‌దా డైరెక్షన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నెల 22న విడుదలవుతున్న `మిఠాయి`కి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యత తమదని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నవ్విస్తామని ప్రియదర్శి అన‌డం కొస‌మెరుపు.