సినిమా వార్తలు

తెలుగులోనూ ప్రియా వారియర్ 'లవర్స్ డే'


5 months ago తెలుగులోనూ ప్రియా వారియర్ 'లవర్స్ డే'

మలయాళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఒరు ఆదార్ లవ్'. ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన‌ ఒక వీడియోలో కన్నుగీటిన ప్రియా వారియర్ ను చూసిన‌ కుర్రాళ్లంతా ఆమెపై మనసు పారేసుకున్నారు. ఈ ఒక్క సినిమాతో ఆమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ రోజు నుంచి ప్రియా వారియర్ పేరు కుర్రాళ్ల నాలుకలపై నిరంత‌రం నానుతూనే వుంది. ఒమర్ లూలూ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గురురాజ్ .. వినోద్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. తాజాగా వారు మాట్లాడుతూ గట్టి పోటీని ఎదుర్కొని ఈ సినిమా తెలుగు హక్కులను మేము దక్కించుకున్నాం. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ఫిబ్రవరి 14వ తేదీన 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నాం. ఇంతటి క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు.