సినిమా వార్తలు

కన్నుగీటే పిల్ల మరో సంచలనం


9 months ago కన్నుగీటే పిల్ల మరో సంచలనం

స్టయిల్ గా కన్నుకొట్టి కుర్రకారును అమితంగా ఆకట్టుకున్న మలయాళీ ముద్దుగమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవి’ అనే పాటలో ఆమె చక్కని హావభావాలు పలికించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  దీంతో ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్‌లో కుర్రకారు ఎంతగానో వెదికింది. పర్యవసానంగా 2018లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా ప్రియ నిలిచింది. రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి నిలిచారు. మూడు, నాలుగు స్థానాల్లో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా,  ప్రియాంక చోప్రా ఉన్నారు. ఇంకా వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా పంపాలి? ఫోన్‌ నెంబరుతో ఆధార్‌ను ఎలా లింక్‌ చేయాలి? సిరియాలో ఏమి జరుగుతోంది? రంగోలీ ఎలా వేయాలి? సెక్షన్‌ 377 అంటే ఏమిటి? బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి? మొబైల్‌ నెంబర్‌ను పోర్టబులిటీ ఎలా చేసుకోవాలి? కికి ఛాలెంజ్‌ అంటే ఏంటి? తదితర అంశాలను నెటిజన్లు అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేశారని తేలింది.