సినిమా వార్తలు

‘శ్రీదేవి బంగ్లా’లోకి ప్రియా వారియర్!


9 months ago ‘శ్రీదేవి బంగ్లా’లోకి ప్రియా వారియర్!

మలయాళ సినిమా‘ఒరు అదార్ లవ్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటి రాత్రికిరాత్రి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ భామ‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టేసింది. ప్రియా వారియర్ నటిస్తున్న తొలి చిత్రానికి ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లతో ఈ చిత్రం నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ ద‌ర్శ‌కుడు  ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా నటిస్తున్నట్టు స‌మాచారం.