సినిమా వార్తలు

ల‌వ‌ర్స్‌డే ప్లాప్ తో చిక్కుల్లో ప్రియావారియ‌ర్‌


7 months ago ల‌వ‌ర్స్‌డే ప్లాప్ తో చిక్కుల్లో ప్రియావారియ‌ర్‌

చిలిపిగా క‌న్నుకొట్టి కోట్ల హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది ప్రియా వారియ‌ర్‌. కొన్ని సెక‌న్ల వీడియోతో పాపుల‌ర్ అయిపోయింది. ఇది అప్ప‌టికే ఇండ్ర‌స్ట్రీలో ఉన్న టాప్‌ హీరోయిన్ల‌కు సైతం కునుకు లేకుండా చేసింది. టాలీవుడ్ నుంచి కూడా ప్రియావారియ‌ర్‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.. త‌న‌ సినిమా `ల‌వ‌ర్స్ డే` ప్ర‌చార భార‌మంతా ప్రియా వారియ‌రే మోసింది. ఈ  సినిమా ఫంక్ష‌న్‌కి అల్లు అర్జున్ కూడా హాజ‌ర‌య్యారు. ప్రియా గ్లామ‌ర్‌కి, అల్ల‌రికి అర్జున్ ఫిదా అయిపోయాడు. దీంతో టాలీవుడ్‌లో ప్రియావారియ‌ర్‌కి అవ‌కాశాలు ఖాయం అని సినీ మేధావులు లెక్క‌లు వేసేశారు. కొంత‌మంది అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలకు ఆమె పేరుని పరిశీలించ‌డం కూడా జ‌రిగిపోయింది.

అయితే ప్రియా వారియ‌ర్ `ల‌వ‌ర్స్ డే` సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ‌డ‌మే కాకుండా, ప్రియా వారియ‌ర్ కెరీర్‌కీ మైన‌స్ గా మారింది, అలాగే ప్రియా స్క్రీన్ ప్రెజెన్స్ పై ఏదేదో ఊహించుకుని అడుగుపెట్టిన యువ‌త‌ను`ల‌వ‌ర్స్ డే` నిరాశ‌ప‌రిచింది. పోనీ ఈ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా – ప్రియా గ్లామ‌ర్‌కూ మార్కులు ప‌డితే బాగుండేది. కానీ.. ఆ విష‌యంలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. చివ‌రికి ఈ సినిమా విడుద‌ల అవ‌క‌పోయుంటే బాగుండేదేమో! అని ప్రియా వారియ‌ర్ కూడా ఇప్పుడు ఫీల‌వుతున్న‌ద‌ట‌. గ‌తంలో ప్రియాను హీరోయిన్‌గా ఎంపిక‌చేద్ద‌మ‌ని సంప్ర‌దించిన‌ప్పుడు `పెద్ద హీరో ఉంటేనే చేస్తా.. `అంటూ ష‌ర‌తులు విధించేద‌ట‌. ఇప్పుడు ప్రియాకి ఆ అవ‌కాశం కూడా క‌రువైపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌డు ప్రియా ప‌రిస్థితి ఏమిటో కాల‌మే చెప్పాలి.