సినిమా వార్తలు

శ్రీదేవి బయోపిక్ కు సన్నాహాలు


6 months ago శ్రీదేవి బయోపిక్ కు సన్నాహాలు

అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న న‌టి శ్రీదేవి.... బాలనటిగా చిత్రరంగంలో కాలుమోపి, అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. తెలుగు సినీ రంగాన్ని నాలుగు దశాబ్దాలకుపైగా ఏలారు. 50 ఏళ్లు దాటినా శ్రీదేవి అతిలోక సుందరిగానే నిలిచారు. విదేశాలలోను శ్రీదేవికి అంతులేని అభిమానులన్నారు. ఆమె మ‌ర‌ణం యావ‌త్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. శ్రీదేవి భౌతికంగా లేక‌పోయినా ఆమె సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి. చివ‌రిగా జీరో సినిమాలో క‌నిపించారు. శ్రీదేవి. ప్రస్తుతం అంత‌టా బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో ఓ చిత్రం చేయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారికంటే ముందే ఆమె భర్త బోని కపూర్.. శ్రీదేవి బ‌యోపిక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన బోని క‌పూర్ ఆ చిత్రానికి న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన చేయ‌నున్నారని స‌మాచారం. ఇప్పటికే శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నారని తెలుస్తోంది.