సినిమా వార్తలు

ఎన్టీఆర్' చైతన్య రథయాత్రకి ఏర్పాట్లు


1 year ago ఎన్టీఆర్' చైతన్య రథయాత్రకి ఏర్పాట్లు

'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన చిత్రీకరణ క్రిష్ దర్శకత్వంలో చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్లో బాలకృష్ణ - విద్యాబాలన్, మిగతా రెండు షెడ్యూల్స్ లో బాలకృష్ణ - రానా .. బాలకృష్ణ - సుమంత్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. నాల్గొవ షెడ్యూల్ ను ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. 'చైతన్యరథయాత్ర'కి సంబంధించిన నేపథ్యంలో షూటింగు కొనసాగుతుంది. శ్రీకాకుళం .. విజయనగరం .. విశాఖ .. అన్నవరం .. గుంటూరు జిల్లాల్లో ఈ రథయాత్రను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషించనున్నాడు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అవుతుంది. నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.