సినిమా వార్తలు

త్వ‌ర‌లో 'ప్రేమకథా చిత్రం 2'


9 months ago త్వ‌ర‌లో 'ప్రేమకథా చిత్రం 2'

సుధీర్ బాబు ... నందిత జంటగా 2013లో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ సిద్ధమైంది. సుమంత్ అశ్విన్ .. నందిత శ్వేత .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాత. తాజాగా ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమా అవుట్ పుట్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ కారణంగానే హిందీ శాటిలైట్ .. డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకి అమ్ముడుపోయాయ‌ని స‌మాచారం. ప్రభాస్ శ్రీను .. విద్యుల్లేఖ కాంబినేషన్లో వచ్చే కామెడీ హైలైట్ అవుతుందంటున్నారు. త్వరలోనే టీజర్ ను విడుద‌ల చేసి .. జనవరిలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాం. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంద‌న్నారు.