సినిమా వార్తలు

రాజమౌళి శిష్యునితో ప్ర‌భాస్ సినిమా


7 months ago రాజమౌళి శిష్యునితో ప్ర‌భాస్ సినిమా

ప్రస్తుతం హీరో ప్రభాస్ చిత్రాలు రెండు సెట్స్ పై వున్నాయి. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తోన్న ఆయన, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా తరువాత యువ దర్శకులతోనే చేయడానికి ప్రభాస్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నార‌ని తెలుస్తోంది.. గతంలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ అనే యువకుడు, ఇటీవల ప్రభాస్ కి ఒక కథ చెప్పార‌ట. ఆ కథ ఆయనకి నచ్చడంతో, యూవీ క్రియేషన్స్ లో నిర్మించాలనే దిశగా చర్చలు చేస్తున్నార‌ని సమాచారం. ఇక కొరటాల శివ .. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన యువకులు కూడా, ప్రభాస్ ను మెప్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. మ‌రి ప్రభాస్ ఎవరెవరికి అవకాశం ఇస్తారో వేచిచూడాలి.