సినిమా వార్తలు

కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?


9 months ago కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?

కన్నడ చిత్రం కేజీఎఫ్ సూపర్ హిట్ టాక్ కావడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. భారీ బడ్జెట్ తో, సరికొత్త పాయింట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ మార్నింగ్ షోకే హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో ఈ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి అంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇందులో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. కర్ణాటకలో 500 థియేటర్లు, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో 350 థియేటర్లు, తమిళంలో 150, కేరళలో 75, హిందీ వెర్షన్ లో 1000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కాగా ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడని సమాచారం. సినీవర్గాలు అందించిన సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ డైరక్టర్ తో సినిమా చేద్దామని ఫిక్స్ అయిన నేపధ్యంలో, యువి క్రియేషన్స్ రంగంలోకి దిగి ఆ డైరక్టర్ ని లాక్ చేసే పనిలో ఉందని ఫిల్మ్ నగర్ టాక్.