సినిమా వార్తలు

ప్రభాస్ 'జాన్' కు మరింత జాప్యం


7 months ago ప్రభాస్ 'జాన్' కు మరింత జాప్యం

ప్రభాస్ నూతన చిత్రంగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయిక.  ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ వుంది. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చిని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలయ్యేది వచ్చేది వచ్చే ఏడాదిలోనే అనేది తాజా సమాచారం. ఈ సినిమాను గురించి ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ను ఇటలీలో పూర్తి చేశాం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ అవసరమైనందువలన ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదిన్నర పట్టవచ్చని అన్నారు. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని తెలుస్తోంది