సినిమా వార్తలు

మహేష్ బాటలో ప్రభాస్.... ‘బాహుబలి’ మల్టీఫ్లెక్స్


4 months ago మహేష్ బాటలో ప్రభాస్.... ‘బాహుబలి’ మల్టీఫ్లెక్స్

హైదరాబాద్ లో మహేశ్ బాబు నిర్మించిన ఏఎంబీ మాల్ ఇటీవలి కాలంలో హాట్ టాపిగా మారింది. అత్యంత విలాసమైన ఈ థియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ అనుభూతి అద్భుతం అని అంటున్నారు. ఇక ఈ తరహా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం చేసే ఆలోచనలో సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చాలామంది నిర్మాతలు వున్నారు. ఇక ప్రభాస్ కూడా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపైనే దృష్టిపెట్టి ఆ దిశగా పనులను ముమ్మరం చేశాడట.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో, చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి పక్కన 'పిండిపాళెం' దగ్గర ఆయన ఈ మాల్ ను నిర్మిస్తున్నాడు. ఒక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యం కలిగి మొత్తం 670 సీట్ల సిట్టింగ్ కలిగిన స్క్రీన్లతో ఈ మాల్ ఉంటుందని తెలుస్తోంది. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో 106 అడుగుల వెడల్పు తెరతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మితమవుతోందని సమాచారం. ఆసియాలో ఇంతపెద్ద తెర కలిగిన మల్టీ ప్లెక్స్ లలో ఇది రెండవదట. మొత్తానికి ప్రభాస్ ‘బాహుబలి’మల్టీ ప్లెక్స్ కడుతున్నాడన్నమాట.