సినిమా వార్తలు

తాజా చిత్రం షూటింగు కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్


1 year ago తాజా చిత్రం షూటింగు కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్ తన 19వ సినిమాగా 'సాహో' చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్, తన 20వ సినిమా కోసం ఇటలీ వెళ్లాడు. ప్రభాస్ 20వ సినిమాను గోపీకృష్ణ మూవీస్ .. యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతోంది. 24వ తేదీన ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయినైనట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే స్థానిక అధికారులతో ఆయన దిగిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరిత్రతో ముడిపడిన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారట.  ఇది ప్రియాడికల్ స్టోరీ అని తెలుస్తున్నది.  80-90 సంవత్సరాల క్రితం సినిమా ప్రారంభమయ్యి ప్రస్తుత కాలానికి వస్తుందని.. ఇందులో ప్రభాస్ కు అతీతమైన శక్తులు ఉంటాయని, భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే ఊహించి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడని.. ఇదే మూల కథగా ఉంటుందని అంటున్నారు.  ఇది టాలీవుడ్ లో కొత్త ప్రయోగమే.  కథ కొత్తగానే ఉంది.  ఇలాంటి కథనంతో మలయాళంలో మమ్మూట్టి సినిమా ఒకటి వచ్చింది.  అదే అయ్యర్ ది గ్రేట్.  ఇందులో మమ్ముట్టికి కూడా ఇలాంటి అతీతమైన శక్తులే ఉంటాయి.  జరగబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి వాటిని అడ్డుకుంటుంటాడు.  ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఒకవేళ ప్రభాస్ 20 కథ కూడా ఇంచుముంచు ఇలాగే ఉంటె.. కథనాలను ఇప్పటి కాలానికి తగ్గట్టుగా రిచ్ గా ప్లాన్ చేస్తారు కాబట్టి సినిమా కొత్తగా ఉంటుందని ఆశించవచ్చు.