సినిమా వార్తలు

రాజమౌళికి ప్రభాస్, ఎన్టీఆర్ గ్రాండ్ ట్రీట్


10 months ago రాజమౌళికి ప్రభాస్, ఎన్టీఆర్ గ్రాండ్ ట్రీట్

తమకు స్టార్‌డం ప్రసాదించిన ‘బాహుబలి’ రాజమౌళిని సర్‌ప్రైజ్ చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్  సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. డైరెక్ట‌ర్ రాజమౌళి వారసుడు కార్తికేయ పెళ్లి సందర్బంగా గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నారు. జనవరి 5న నిర్వహించే వివాహ వేడుకను పురస్కరించుకుని ఈ ఇద్దరూ ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ప్లానింగ్ ఇటీవలే ‘RRR’ షూటింగ్ ప్రారంభోత్సవంలోనే జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో ఉన్న అ్రగ హీరో, హీరోయిన్లందరినీ ఒకచోటికి చేర్చి ఇప్పటి వరకూ ఎక్కడా చూడని విధంగా ఈ పార్టీని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం అగ్రహీరో, హీయిన్లందరి దగ్గరా ఖాళీగా ఉన్న డేట్స్ తీసుకుని ఫైనల్‌గా ఒక డేట్ ఫిక్స్ చేయబోతున్నట్టు భొగట్టా. అటు తార‌క్‌కు, ఇటు ప్రభాస్‌కు ఇద్దరికీ రాజమౌళితో మంచి అనుబంధం ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. ఎన్టీఆర్‌తో 3 సినిమాలు, ప్రభాస్‌‌తో 2 సినిమాలు చేసిన రాజమౌళికి తగిన గౌరవాన్ని అందించేందుకు హీరోలిద్దరూ ఈ విధమైన ట్రీట్‌ ఇస్తున్నారని సమాచారం. ఈ వెడ్డింగ్ పార్టీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది