సినిమా వార్తలు

మళ్లీ జతగా కనిపిస్తున్న ప్రభాస్, అనుష్క


9 months ago మళ్లీ జతగా కనిపిస్తున్న ప్రభాస్, అనుష్క

నాలుగు సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు చాలానే వినిపించాయి. అయితే కొన్నాళ్ల నుంచి ఇటువంటి వార్తలు వినిపించడం లేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. 'బాహుబలి' తో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం విదితమే. దీంతో ప్రభాస్ సినిమాలకు జపాన్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ హిట్ సినిమాలైన 'మిర్చి',  'డార్లింగ్' సినిమాలను జపాన్ లో విడుదల చేయాలని ఆ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క కలిసి నటించడంతో వారిద్దరూ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మార్చి రెండవ తారీకున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోందని సమాచారం. ఈ నేపధ్యంలో వారిద్దరూ కలిసి కనిపిస్తుండడంతో తిరిగి పాత వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. మరోమారు వీరు ప్రేమపక్షులుగా తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. మరో వైపు వీరిద్దరూ తమ దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెబుతున్నారు.