సినిమా వార్తలు

ఇటలీలో ప్రభాస్‌, అనుష్క ఎంగేజ్‌మెంట్?


11 months ago ఇటలీలో ప్రభాస్‌, అనుష్క ఎంగేజ్‌మెంట్?

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపుపొందిన టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌, ఆ చిత్రం హీరోయిన్‌ అనుష్కశెట్టి ల వివాహం త్వరలో జరగనుందంటూ మరోసారి సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు హల్‌‌చల్‌ చేస్తున్నాయి. ప్రభాస్‌ ఇటలీలో ఉండడం, అనుష్క కూడా ఇటీవల ఇటలీ వెళ్లడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఇటీవల ఇటలీ వెళ్లి ప్రభాస్‌ను కలిసిందనే వార్త వినిపిస్తోంది. దీంతో మళ్లీ వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి. అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుభవార్త వెలువరించాలన్న ఉద్దేశంతోనే చర్చించుకునేందుకు అనుష్క ఇటలీ వెళ్లారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఇటలీలో జరగనుందని జాతీయ మీడియా కూడా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తమీద క్లారిటీ కోసం వేచి చూడాల్సిందే