సినిమా వార్తలు

ప్రభాస్ సినిమా పేరు ‘అమూర్’ కాదు ‘జాన్’


1 year ago ప్రభాస్ సినిమా పేరు ‘అమూర్’ కాదు ‘జాన్’

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ చేస్తూనే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ మూవీలోనూ నటిస్తున్న విషయం విదితమే. సాహో సినిమా గత ఏడాది మొదలైతే, జిల్ రాధాకృష్ణ సినిమా ఈ మధ్యనే చిత్రీకరణ ప్రారంభమైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ పక్కన మొదటిసారి పూజ హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గా అమూర్ అనుకుంటున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. అమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అని అర్ధం అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రభాస్ 20వ సినిమాకి టైటిల్ అమూర్ కాదని ‘జాన్’ అనే వేరొక టైటిల్ ని ఫైనల్ చేశారన్నటాక్ ఫిలిం సర్కిల్స్ లో అంటున్నారు. అయితే జాన్ అనేది తాను లవర్ ని పిలుచుకునే పిలుపు అంటూ ప్రచారం మొదలైంది. ఇక జాన్ అనే టైటిల్ ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ సినిమా కూడా పలు భాషల్లో తెరకెక్కడం తో సినిమాపై అప్పుడే అంచానాలు ప్రారంభమయ్యాయి. యువి క్రియేషన్స్ – గోపికృష్ణ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.