సినిమా వార్తలు

చిరు కోసం కొరటాల ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌


9 months ago చిరు కోసం కొరటాల ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌

అప‌జ‌యం అనేదే ఎరుగని దర్శకుడు కొరటాల శివ... తాను ఎంచుకున్న కథలో కొత్తదనంతో పాటు సందేశాన్ని జోడించి క్లాస్.. మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంటాడు. మహేష్‌తో ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్టు ఇప్పటికే ప్ర‌క‌టించారు. మరి చిరు కోసం కొరటాల ఎలాంటి కథను సిద్ధం చేశారనే దానిపైనే స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే చిరుతో తెరకెక్కించబోయే చిత్రంలోనూ కొరటాల సందేశాన్ని అందిస్తున్నార‌ని తెలుస్తోంది. గతంలో మెగాస్టార్.. ‘ఠాగూర్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం అమోఘ విజ‌యం సాధించింది.  ప్రస్తుతం కొరటాల కూడా ఇదే తరహా పవర్‌ఫుల్ కథాంశాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘సైరా’ చిత్రం మార్చి నెలాఖరుకి చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం చిరు, కొరటాల చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.