సినిమా వార్తలు

మళ్లీ తెరమీదకు ‘ఐ లవ్యూ నా రాజా’ డైరెక్షన్


8 months ago మళ్లీ తెరమీదకు ‘ఐ లవ్యూ నా రాజా’ డైరెక్షన్

రచయితగా, దర్శకునిగా, నటునిగా వెండితెరపై పోసాని తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. దర్శకుడిగా విజయాలను ఎక్కువగా అందుకోలేకపోయిన ఆయన, నటుడిగా బిజీ అయిన విషయం విదితమే. విలక్షణమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో పోసాని లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి లేదు. చాలా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకువెళుతున్నారు. దీంతో ఇక ఆయన దర్శకత్వం జోలికి వెళ్లరేమోనని అంతా అనుకున్నారు.

కానీ ఆయన త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇటీవలికాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నారట. ఈ కథను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో పోసాని వున్నారనే వార్త వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారని సినీజనాలు అంటున్నారు.