సినిమా వార్తలు

నేడు రజనీ బ‌ర్త్‌డే .. 'పెట్టా' టీజర్ రిలీజ్


9 months ago నేడు రజనీ బ‌ర్త్‌డే .. 'పెట్టా' టీజర్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి ఉన్న‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రజనీకాంత్ పుట్టినరోజు నేడు. రజనీ పుట్టినరోజు అంటే .. ఆయన అభిమానులకు పండుగ. ఆ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించడం కోసం రజనీ కూడా తనవంతు ప్రయత్నం చేస్లూ ఉంటారు. అందులో భాగంగానే నేటి ఉదయం 11 గంటలకు 'పెట్టా' సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రజనీ ఇస్తోన్న ట్రీట్ ఇదేమ‌రి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా'మూవీ చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో .. ఆసక్తికరమైన కథనంతో నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.