సినిమా వార్తలు

‘పెనివిటి’కి సినీ అభిమానులు ఫిదా


12 months ago ‘పెనివిటి’కి సినీ అభిమానులు ఫిదా
తారక్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. పాటల ద్వారా చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టింది. నిన్న విడుదల చేసిన పెనివిటి పాట శ్రోతల హృదయాలను హత్తుకునేలా ఉంది. రాయలసీమ నేపథ్యంలో సాగిన ‘పెనివిటి’ పాట సంగీత ప్రేక్షకులని అలరిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ శ్రోతల హృదయాలను కదిలిస్తున్నాయి. మీ అమ్మను గెలిసేసినాను అన్నుకున్నాడో ఏందో.. అంటూ మాటలతో మొదలైన ఈ పాట కోసం మనసు పెట్టి పని చేశానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. ఓ భర్త కోసం భార్య ఎదురు చూపులను రాయల సీమ యాసలో వర్ణిస్తూ.. పెనివిటి పాట సాగుతుంది. కాళభైరవ ఆలపించిన ఈ పాటకు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా సినీ అభిమానులంతా ఫిదా అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం పాటలను రిలీజ్ చేస్తూ.. ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇటీవలే ఈ చిత్ర తొలిపాటను విడుదల చేసిన నిర్మాతలు..  రెండో పాటను కూడా విడుదల చేసి మరింత హైప్ ను పెంచేశారు.  ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంగా ఈషా రెబ్బా, నాగబాబు, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మరి కాసేపట్లో ఈ సినిమాలోని అన్ని పాటలను ఆడియో జ్యూక్ బాక్స్ ను విడుదల చేయనున్నారు. అభిమానులంతా ఆతృతగా రాబోయే మరో రెండు పాటలకు ఎదురు చూస్తున్నారు.