సినిమా వార్తలు

ఆప‌రేష‌న్‌-2019 చిత్రానికి చ‌క్క‌ని స్పంద‌న


10 months ago ఆప‌రేష‌న్‌-2019 చిత్రానికి చ‌క్క‌ని స్పంద‌న

ప‌బ్లిక్ స్టార్ శ్రీకాంత్ న‌టించి, ఇటీవ‌లే విడుద‌లైన ఆప‌రేష‌న్‌-2019 చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. ర‌జినీకాంత్ న‌టించిన భారీ చిత్రం 2.ఓ విడుద‌లైన స‌మ‌యంలోనే ఆప‌రేష‌న్‌-2019 విడుద‌లై గ‌ట్టిపోటీని ఎదుర్కొంటోంది. నిజానికి ఈ సినిమాల మ‌ధ్య‌ ఏమాత్రం పోలిక లేక‌పోయిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కులు పెద్ద చిత్రానికి ఓటు వేయ‌డం స‌హ‌జ‌మే. అయితే ఈ రెండు చిత్రాల్లో ఉన్న సోష‌ల్ మెసేజ్ సాధార‌ణ ప్ర‌జ‌లంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలావుండ‌టం విశేషం. ఒక చిత్రం సెల్ ఫోన్ల వినియోగం గురించి చెబుతుండ‌గా, మ‌రో సినిమా దేశంలోని పౌరుల‌కు ఓటు హ‌క్కును బాధ్య‌త‌గా వినియోగించుకోవాల‌ని తెలియ‌జేస్తోంది. 2.ఓ అత్య‌ధిక‌ బ‌డ్జెట్ క‌లిగిన సినిమానే కాకుండా టెక్నిక‌ల్ వండ‌ర్‌గా నిలిచింది. దీంతో చిన్నారులు, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను అమితంగా ఆక‌ట్ట‌కుంది. ఫ‌లితంగా ఈ నెల తొలివారంలో విడుద‌లైన చిత్రాల్లో ప్రేక్ష‌కులు 2.ఓ కే ఓటువేశారు. ఈ కార‌ణంతోనే ఆప‌రేష‌న్ 2019 వెనుక‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.

అయితే ఈ సినిమా తొలి షో చూసిన ప్రేక్ష‌కుల మాట‌ల ప్ర‌కారం ఈ సినిమా బాగుంద‌ని, మెల్ల‌మెల్ల‌గా పుంజుకుంటుంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా ప్ర‌స్తుత ఎన్నిక‌ల వాతావ‌ర‌ణానికి త‌గిన స‌మ‌యంలో ఈ చిత్రం విడుద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. ఓటరుకు ఈ సినిమా మంచి సందేశాన్ని అందిస్తోంది. అదే విధంగా హీరో శ్రీకాంత్ కెరియ‌ర్‌లో అత్యుత్త‌మ న‌ట‌న క‌బ‌రిచిన చిత్రంగా ఆప‌రేష‌న్ -2019 నిలిచిపోతుంద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. అందుకే ఈ చిత్రం గురించి ఏమైనా చెప్పాల‌నుకుంటే ఒక‌సారి వీక్షించి నిజ‌మైన స్పంద‌న ను గ్ర‌హించాలి. అదేవిధంగా ఇటువంటి సామాజిక దృక్ఫ‌ధాన్ని ప్ర‌తిబింబించే చిత్రాల‌ను ప్రోత్స‌హించాలిగానీ, నెగిటివ్ ప‌బ్లిసిటీ చేయ‌డం తగ‌దు. అయిత ఈ సినిమాకు ఉన్న ఆద‌ర‌ణ‌, ప్ర‌జ‌ల అభిప్రాయం కార‌ణంగా ఏస్థాయికి చేరుకుంటుందో వేచి చూడాలి.