సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 లో ఆ ముగ్గురు హీరోల్లో ఒకరు?


1 year ago బిగ్ బాస్ 3 లో ఆ ముగ్గురు హీరోల్లో ఒకరు?

తెలుగులో 'బిగ్ బాస్' ఫస్టు సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షోను సరదాగా .. సందడిగా ఎన్టీఆర్ నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ షోతో రేటింగ్స్ పరంగా 'స్టార్ మా' దూసుకుపోయింది. అపూర్వమైన ఆదరణ లభించడంతో ఆ ఛానల్ వారు నాని హోస్ట్ గా 'బిగ్ బాస్ 2' షోను నిర్వహించారు. సెకండ్ సీజన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని తనదైన స్టైల్లో మెప్పించాడంటూ చాలామంది ప్రశంసించారు.  ఇక ఇప్పుడు 'బిగ్ బాస్ 3' ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై అందరూ దృష్టి పెట్టారు. ఒకవేళ 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు మొదలైతే, ఈ సీజన్ కి ఏ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రానా .. అల్లు అర్జున్ .. విజయ్ దేవరకొండ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఆల్రెడీ హోస్ట్ గా చేసిన అనుభవం రానాకు వుంది. ఇక సమయస్ఫూర్తితో షోను నడిపించగల సామర్థ్యం .. టీవీల ముందు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టే క్రేజ్ అల్లు అర్జున్ కి .. విజయ్ దేవరకొండకి కూడా వుంది. ఇక 'బిగ్ బాస్ 3' కోసం ఈ ముగ్గురిలో హోస్ట్ గా బుల్లితెరపై ఎవరు ప్రత్యక్షమవుతారో వేచి చూడాలి.