సినిమా వార్తలు

21న ‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక


9 months ago 21న ‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక

హీరో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం విదిత‌మే. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయ‌నున్నారు. రెండో భాగం జనవరి 25న విడుదల కానుంది.  ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలకానుంది. ఇక ఆడియో వేడుక ఈ నెల 21న నిమ్మకూరులో నిర్వహించనున్నార‌ని స‌మాచారం. తాజాగా ‘ఎన్టీఆర్’లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం షేర్ చేసింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.