సినిమా వార్తలు

క్లీన్ ‘యూ’ అందుకున్న‘కథానాయకుడు’


8 months ago క్లీన్ ‘యూ’ అందుకున్న‘కథానాయకుడు’

మహానాయకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం విదితమే. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో తానే లీడ్ రోల్ పోషిస్తూ స్వయంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. చిత్రాన్ని ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా రూపొందించారు. మొదటి భాగాన్ని జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర మొదటిభాగం ‘కథానాయకుడు’ సెన్సార్ పూర్తి చేసుకుందని చిత్రయూనిట్ తెలిపింది. ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందిందని పేర్కంది. ఈ చిత్రంలో విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, రానా, హన్సిక, పాయల్ రాజ్ పుత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.