సినిమా వార్తలు

బాహుబలిని ఫాలో అవుతున్న ‘ఎన్టీఆర్’?


1 year ago బాహుబలిని ఫాలో అవుతున్న ‘ఎన్టీఆర్’?

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు పార్టులుగా రూపొందుతున్నదనే టాక్ వినిపిస్తోంది. దీనిని చూస్తుంటే ఎన్టీఆర్ టీం ‘బాహుబలి’ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తున్నదని సినీ విశ్లేషకులు అంటున్నారు. 'ఎన్టీఆర్' సినిమా వచ్చే ఏడాది జనవరి 9 న రిలీజ్  చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ చిన్నతనం - సినీ జీవితం కవర్ అవుతాయట.  ఇక రెండో భాగాన్ని జనవరి 25 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కంక్లూజన్ లో ఎన్టీఆర్ రాజకీయ జీవితం.. అయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కవర్ చేస్తారట.  అంటే మొదటి భాగం థియేటర్లలో ఉండగానే రెండో భాగం రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. మరి దీనిపై ఎన్టీఆర్ దర్శకుడు క్రిష్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నయని అంటున్నారు.