సినిమా వార్తలు

అచ్చమైన తెలుగులో 'ఎన్టీఆర్' తొలి పాట


9 months ago అచ్చమైన తెలుగులో 'ఎన్టీఆర్' తొలి పాట

బాలకృష్ణ హీరోగా, టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీస్ నటిస్తున్న 'ఎన్టీఆర్' సినిమాలోని తొలి పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఘనకీర్తిసాంధ్ర, విజితాఖిలాంధ్ర, జనతా సుదీంధ్ర, మణిదీపకా... అంటూ సాగే పాట లిరిక్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి స్వరపరచిన ఈ పాటలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ స్మృతులనును గుర్తు చేస్తూ, ఆయన పోషించిన పలు పాత్రల పేర్లను జతచేర్చారు. కే శివదత్త, డాక్టర్ కే రామకృష్ణలు ఈ పాటను రాయగా, కైలాష్ ఖేర్ ఆలపించాడు. "భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠరావణా, సురాధి పురాణ పురుష భూమికా పోషకా..." అనడం బాగుంది. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ తెచ్చుకున్న 'కథానాయకుడు' తొలి పాట లిరికల్ వీడియోను అందరినీ అలరిస్తోంది.