సినిమా వార్తలు

21న ‘ఎన్టీఆర్’ కథానాయకుడు ఆడియో, ట్రైలర్ విడుదల


9 months ago 21న ‘ఎన్టీఆర్’ కథానాయకుడు ఆడియో, ట్రైలర్ విడుదల

‘ఎన్టీఆర్’ తొలిభాగం కథానాయకుడు ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌‌లో ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన స్టిల్‌ను కూడా విడుదల చేశారు. అయితే తొలుత ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను ఎన్టీఆర్ జన్మస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో విడుదల చేయాలనుకున్నారు. పెథాయ్ తుపానుతో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్పు చేశారు. డిసెంబర్ 21న నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల నడుమ ‘ఎన్టీఆర్’ కథానాయకుడు ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని జనవరి 9, 2019లో విడుదల చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాత్రల కోసం ప్రముఖ తారాగణాన్ని తీసుకోవడం విశేషం. విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.