సినిమా వార్తలు

రాజమౌళి చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నాహాలు


11 months ago రాజమౌళి చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నాహాలు

దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అనగానే టాలీవుడ్ అభిమానులంతా సంతోషంతో ఎగిరిగేంతేసినంత పనిచేశారు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతీవార్తను ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరోవార్త ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

త్రివిక్రమ్ తో కలిసి హిట్ కొట్టాలనుకున్న ఎన్టీఆర్ కల నెరవేరిపోయింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' ఎన్టీఆర్ ముచ్చటను తీర్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ సినిమా కోసం నాన్ స్టాప్ గా పనిచేసిన ఎన్టీఆర్, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తాను విశ్రాంతి తీసుకోవాలని ఏమాత్రం అనుకోవడం లేదని సమాచారం. తన తదుపరి సినిమా రాజమౌళి ఉందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఆసినిమాలో తన లుక్ కి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. శారీరక పరమైన వ్యాయామం కోసం 45 రోజుల పాటు కఠోర శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది. వచ్చేనెల 15వ తేదీ నుంచి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ పాల్గొననున్నారని సమాచారం.