సినిమా వార్తలు

మారిన ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్!


9 months ago మారిన ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్!

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన 'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఇక నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'మహానాయకుడు'పై నిలిచింది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోకపోవచ్చనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14వ తేదీకి సినిమా విడుదలను వాయిదా వేశారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైన పరిస్థితులను ఈ రెండవ భాగంలో చూపించనున్నారు. చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కల్యాణ్ రామ్ పూర్తిస్థాయిలో ఇందులో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ మరింత బాగా కుదిరారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.