సినిమా వార్తలు

అందరినీ కంట తడిపెట్టించిన ఎన్టీఆర్


1 year ago అందరినీ కంట తడిపెట్టించిన ఎన్టీఆర్

‘తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన 27 సినిమాల్లో ఏ ఒక్క సినిమాలోలో కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్ట‌లేద‌ని, కానీ అరవింద సమేతలో.. త్రివిక్ర‌మ్ ఆ సీన్ పెట్టాడ‌ని చెప్పాడు జూనియ‌ర్. అది చేస్తున్న‌పుడు యాదృచ్ఛిక‌మో ఏమో అనిపించిందని’ అన్నాడు ఎన్టీఆర్. "అర‌వింద స‌మేత" ప్రీ రిలీజ్ వేడుక‌లో ఒకేసారి అంత‌మంది అభిమానుల‌ను చూసి ఏడుపు ఆపుకోలేపోయాడు జూనియ‌ర్. తండ్రిని త‌లుచుకుని చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ప్రతీ వేడుక‌లో తాత ఫోటో పైన ఉంటుంద‌ని, కానీ ఇంత త్వ‌ర‌గా త‌మ తండ్రి ఫోటో కూడా తాత ప‌క్క‌నే చేరిపోతుంద‌ని క‌ల‌లో కూడా ఊహించలేద‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఆయ‌న స్పీచ్ జ‌రుగుతున్నంత సేపు కూడా క‌ళ్లలో నీళ్లు వ‌స్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌నిషి ఉన్న‌పుడు ఆ వ్యాల్యూ తెలియ‌ద‌ని.. పోయిన త‌ర్వాతే తెలుస్తుంద‌ని.. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా చేయ‌డం కోస‌మే ఆయ‌న పైకి వెళ్లిపోయాడేమో అంటూ ఏడ్చేసాడు ఎన్టీఆర్. అంతేకాదు.. తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన 27 సినిమాల్లో ఏ ఒక్క ద‌ర్శ‌కుడు కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్ట‌లేద‌ని.. కానీ ఇందులో త్రివిక్ర‌మ్ ఆ సీన్ పెట్టాడ‌ని చెప్పాడు జూనియ‌ర్. అది చేస్తున్న‌పుడు యాదృచ్ఛిక‌మో ఏమో అనిపించింది ఎన్టీఆర్. త‌న తండ్రి ఉన్న‌న్ని రోజులు ఎప్పుడూ అభిమానులే ప్రాణంగా ఉన్నార‌ని.. వాళ్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చెప్పిన‌ట్లు గుర్తు చేసుకున్నారు. తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కూడా అదే చేస్తాన‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఇక త్రివిక్ర‌మ్ గురించి చెప్తూ త‌న‌కు 12 ఏళ్ల క‌ల ఈ మ‌నిషితో ప‌ని చేయ‌డం అని చెప్పాడు ఎన్టీఆర్. ఎందుకు త‌మ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాలేదో త‌న‌కు కూడా అర్థం కాలేద‌ని చెప్పాడు ఈ హీరో. అయితే ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో క‌చ్చితంగా ఇన్నేళ్ల లోటు తీర్చేస్తానంటున్నాడు ఎన్టీఆర్. త‌న‌కు ఈ నెల రోజుల పాటు అన్న‌లా మారిపోయాడని త్రివిక్ర‌మ్ గురించి చెప్పుకొచ్చాడు జూనియ‌ర్. ఇక ఎప్పుడూ స్పీచ్ చివ‌ర్లో చెప్పే ఓ మాట‌ని మ‌రిచిపోయాడు ఎన్టీఆర్. కానీ వెంట‌నే గుర్తొచ్చి మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చి ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లండి.. మా నాన్న‌కు ఎలాగూ చెప్ప‌లేక‌పోయాను.. ఇప్పుడు మీరు చెబుతున్నాను అంటూ ముగించాడు ఎన్టీఆర్. మొత్తానికి ఈయ‌న మాట్లాడుతున్నంత సేపు అంద‌రి మొహాల్లోనూ ఏదో తెలియ‌ని బాధ క‌నిపిస్తూనే ఉంది.