సినిమా వార్తలు

ఎన్టీఆర్ విగ్ర‌హాల‌తో సినిమాకు ఆహ్వానం


8 months ago ఎన్టీఆర్ విగ్ర‌హాల‌తో సినిమాకు ఆహ్వానం

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమా రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  తండ్రి పాత్రను స్వయంగా తానే పోషిస్తూ దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కి అప్పగించి ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్ర నిర్మాణం సాగిస్తున్నారు.  చిత్రాన్ని ‘‘కథానాయకుడు, మహానాయకుడు’’ అనే రెండు భాగాలుగా రూపొందించారు. అయితే ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తూ రోజుకో పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ మరో వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 9న మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్లలో 100 ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. ఈ మేరకు మొదటి విగ్రహాన్ని తిరుపతిలోని పీజెఆర్ థియేటర్‌లో బాలకృష్ణ, విద్యాబాలన్ ఆవిష్కరించనున్నారు. ప్రేక్ష‌కుడు సినిమా చూడ‌క‌ముందే ఎన్టీఆర్ విగ్రహాన్ని దర్శించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు.