సినిమా వార్తలు

మౌనమ‌నే ఆయుధంతో ఎన్టీఆర్... ఇంట్రెస్టింగ్ న్యూస్‌


10 months ago మౌనమ‌నే ఆయుధంతో ఎన్టీఆర్... ఇంట్రెస్టింగ్ న్యూస్‌

రౌద్ర రూపాన్ని తారాస్థాయిలో ర‌క్తిక‌ట్టించే ఎన్టీఆర్ మౌనంగా ఉంటే చూడ‌గ‌ల‌మా? ఆ మౌనంలో భావ‌గాంభీర్యాన్ని అర్థం చేసుకోగ‌ల‌మా? ఇప్ప‌డు ఈ రెండు అనుభూతులను అభిమానులు సొంతం చేసుకోనున్నారు. తాజాగా "అర‌వింద స‌మేత‌ష‌కు సంబందించిన‌ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సినిమాలో తొలి అర‌గంట ఎన్టీఆర్‌కు మాట‌లు ఉండ‌వ‌ని.. మ‌రీ అవ‌స‌రం అయిన‌పుడు మాత్రమే నోరు తెరుస్తాడ‌ని మాట‌ల మాంత్రికుడు వెల్ల‌డించారు. అస‌లు ఎన్టీఆర్ లాంటి హీరోను తొలి అర‌గంట మాట‌ల్లేకుండా ఉంచ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క విష‌యం ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌చేస్తుంద‌ని.. క‌చ్చితంగా "అర‌వింద స‌మేత" తెలుగులో కొత్త పంథాకు తెర తీస్తుందని చెబుతున్నాడు త్రివిక్ర‌మ్. ఏదేమైనా ఎన్టీఆర్ లాంటి హీరోతో అంత సేపు మాట్లాడించ‌కుండా ఉండ‌టం అనేది చిన్న సాహ‌సం అయితే కాదు. ఇందులో ఎన్టీఆర్ కారెక్ట‌ర్ "అత‌డు" సినిమాలో మ‌హేష్ బాబులా అవ‌స‌రం అయిన‌పుడు మాత్ర‌మే మాట్లాడ‌తాడ‌ని స‌మాచారం.  మ‌రోవైపు డైలాగ్స్ ప‌లికించ‌డంలో పేరుపొందిన ఎన్టీఆర్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ క‌లిస్తే ఎలావుంటుందో మ‌రి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.  డైలాగులు రాయ‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట‌.. వాటిని ప‌లికించ‌డంలో ఎన్టీఆర్ దిట్ట. అందుకే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.