సినిమా వార్తలు

రూ 10 కోట్లు దాటేస్తున్న ‘ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్


11 months ago రూ 10 కోట్లు దాటేస్తున్న ‘ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాలో చంద్రబాబునాయుడుగా రానా .. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటించారు. ఇక శ్రీదేవి పాత్రకి గాను రకుల్ ప్రీత్ ను తీసుకోగా, ఎస్వీఆర్ పాత్ర కోసం నాగబాబును తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినీరంగ ప్రయాణం, రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతుండటం వలన అందరిలోను ఆసక్తి వుంది. ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలను మంచి క్రేజ్ వున్న నటీనటులు పోషిస్తూ ఉండటం వలన మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఒక ప్రముఖ సంస్థ ఓవర్సీస్ రైట్స్ నిమిత్తం 10 కోట్ల వరకూ ఆఫర్ చేసిందట. అయితే సినిమాకి గల క్రేజ్ ను బట్టి ఓవర్సీస్ రైట్స్ 12 కోట్లకు తగ్గకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఓవర్సీస్ నిమిత్తం ఈ స్థాయి రేటు పలకడం బాలకృష్ణ కెరియర్లో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.