సినిమా వార్తలు

ఎన్టీఆర్‌..క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడు


11 months ago ఎన్టీఆర్‌..క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడు

తన తండ్రి తార‌క‌రామారావు పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం టైటిల్ ను  అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని పేరు పెట్టినట్టు జాగర్లమూడి క్రిష్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. "ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు" అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ జానపద చిత్రాలు చేస్తున్న వేళ, ఎలా ఉంటాడో చూపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. జనవరి 9న చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు‘‘అతను కథగా మారితే, ‘కథానాయకుడు’. అతనే ఓ చరిత్రయితే, ‘మహానాయకుడు’..’’ అంటూ నటుడు రానా దగ్గుబాటి.. ‘యన్‌.టి.ఆర్’ సినిమా పార్ట్-2 టైటిల్‌ ప్రకటించాడు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో రానా.. చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా 2019, జనవరి 24న రిపబ్లిక్ డే పురస్కరించుకుని విడుదల కానుందని ప్రకటించాడు. తొలుత ‘యన్‌.టి.ఆర్’ టైటిల్ మాత్రమే ప్రకటించిన చిత్ర యూనిట్. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ప్రకటించింది. ముందు భాగాన్ని ‘యన్‌.టి.ఆర్. కథానాయకుడు’గాను, రెండో భాగంగా ‘యన్‌.టి.ఆర్. మహానాయకుడు’గా విడుదల చేయనున్నారు. తొలి భాగాన్ని జనవరి 9న విడుదల చేయనున్నామని దర్శకుడు క్రిష్ చెప్పారు. తాజాగా విడుదలైన ‘యన్.టి.ఆర్. మహానాయకుడు’ ఫస్ట్ లుక్‌లో ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ఎన్టీఆర్ రూపంలో బాలయ్య అల‌రిస్తున్నాడు.