సినిమా వార్తలు

రాజమౌళి వర్క్‌షాప్‌కు తారక్, చెర్రీ!


11 months ago రాజమౌళి వర్క్‌షాప్‌కు తారక్, చెర్రీ!

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో టాలీవుడ్ లో మొదలైన మల్టీస్టారర్ హవా అలా కొనసాగుతూనేవుంది. తాజాగా మరో మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే దర్శకుడు రాజమౌళి చెర్రీ, తారక్ లతో నిర్మించబోయే చిత్రం. రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ చడీచప్పుడు లేకుండా ఉన్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం స్పీడందుకున్నట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ అవడంతో అంచనాలకు రెక్కలొచ్చేశాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి దర్శకధీరుడు.. తారక్‌, చెర్రీలకు పిలుపిచ్చాడని సమాచారం. ఈ మేరకు స్టార్ హీరోలిద్దరూ ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరవుతున్నట్టు సమాచారం. ఈ వర్క్‌షాప్‌లో రాజమౌళితోపాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొనబోతోందని తెలుస్తోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్, చెర్రీ లిద్దరూ అన్నదమ్ములుగా నటించనున్నట్టు భోగట్టా. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 2020లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.