సినిమా వార్తలు

అక్టోబరు 5న ‘నోటా’


12 months ago అక్టోబరు 5న  ‘నోటా’

యూత్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ తాజా సినిమా "నోటా" అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఇందులో విజ‌య్ ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న "నోటా"పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

విజ‌య్ దేవ‌రొకండ‌కు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం త‌మిళ్ వ‌ర్ష‌న్‌లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగులో రానా, మహేశ్ బాబు తర్వాత ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ. "నోటా"లో మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రంతో త‌మిళ‌నాట కూడా పాగా వేయాల‌ని చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.