సినిమా వార్తలు

అక్టోబరు 5న ‘నోటా' రిలీజ్


1 year ago అక్టోబరు 5న ‘నోటా' రిలీజ్

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నోటా' రెడీ సిద్ధం అవుతోంది. అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందనే వార్తలు కొన్ని ఇటీవల వచ్చాయి. ఆ తరువాత ఒక వివాదం కారణంగా ఈ సినిమా థియేటర్లకు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసి, తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా విజయ్ దేవరకొండ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించగా, సత్యరాజ్, నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు.