సినిమా వార్తలు

నిండా మునిగిన 'నోటా' నిర్మాత


11 months ago నిండా మునిగిన 'నోటా' నిర్మాత

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా 'నోటా' రూపొందింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తరువాత నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు అమాంతం తగ్గిపోయాయి. దాంతో అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పబ్లిసిటీతో పాటు ఇతర ఖర్చులకి మరో 4 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా 12 కోట్లు ఇస్తామంటూ ఏపీ నుంచి .. 4 కోట్లు ఇస్తామంటూ నైజామ్ నుంచి .. 2 కోట్లు ఇస్తామంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ అంతకి మించిన రేట్లు చెప్పిన జ్ఞానవేల్ రాజా .. చివరికి తానే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడట. ఫలితంగా ఆయనకి భారీ నష్టాలు వచ్చి నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది.