సినిమా వార్తలు

ప్రియా వారియర్ పై చిందులు తొక్కుతున్న కో-హీరోయిన్


7 months ago ప్రియా వారియర్ పై చిందులు తొక్కుతున్న కో-హీరోయిన్

‘ఒరు ఆడార్ లవ్’టీజర్లో మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలైంది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రావూఫ్, నూరిన్ షరీఫ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా వారియర్‌ పై నిప్పులు చెరుగుతున్నారు. లవర్స్ డే చిత్రం కోసం తొలుత నూరీన్ షరీఫ్ మెయిన్ హీరోయిన్‌‌గా తీసుకున్నారు. ప్రియా కంటే నూరీన్ పాత్ర నిడివే ఎక్కువ ఉండేది. అయితే కన్నుగీటిన సన్నివేశంతో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడంతో నూరీన్ పాత్రను చాలావరకూ తగ్గించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నూరీన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తర్వాత నన్ను పక్కన పెట్టారు. ఆమె పాత్రను ఎలివేట్ చేసేలా స్క్రిప్టును మార్చేశారు. ప్రియా వారియర్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒరు ఆడార్ లవ్ సినిమా కథను దర్శకుడు ఒమర్ లులు పూర్తిగా మార్చేశారు. క్లైమాక్స్ తప్ప మిగితా అంతా తిరిగి షూట్ చేశారు. అందుకే ఇకపై హీరో రోషన్ అబ్దుల్‌తో నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒప్పుకోను. ఎందుకంటే నా కెరీర్‌ను ప్రియ గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన అన్నారు.