సినిమా వార్తలు

‘అమ్మ’పాత్రలో నిత్య లుక్ ఇదే!


10 months ago ‘అమ్మ’పాత్రలో నిత్య లుక్ ఇదే!

ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితగా నిత్యా మీనన్‌ ఓ బయోపిక్‌ చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని నిత్యా మీనన్‌ లుక్‌ని జయలలిత రెండో వర్థంతి సందర్భంగా విడుదల చేశారు. ప్రేక్షకులను ఈ లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్యా మీనన్‌ అచ్చం ‘అమ్మ’లా ఉన్నారని సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అని పిలిచే జయలలిత జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని దర్శకురాలు తెలిపారు.