సినిమా వార్తలు

యాత్ర స‌మ‌యంలో నిత్య ప్రాణ విడుద‌ల‌


8 months ago యాత్ర స‌మ‌యంలో నిత్య ప్రాణ విడుద‌ల‌

ద‌క్షిణాదిలో నిత్యామీనన్ కి ఎంతో క్రేజ్ వుంది. మొదటి నుంచి కూడా నటనకి అవకాశం కలిగిన విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ చేయ‌డ‌మే అందుకు కారణం. నిత్యామీనన్ తాజా చిత్రంగా 'ప్రాణ' నిర్మితమైంది. ఈ సినిమా ఆధ్యంతం ఒక్క నిత్యామీనన్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. ఒక రకంగా ఇదొక ప్రయోగాత్మక చిత్రం. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 7న 'మహానాయకుడు' .. ఫిబ్రవరి 8వ తేదీన 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలాంటి సమయంలో 'ప్రాణ' రంగంలోకి దిగడం విశేషం..