సినిమా వార్తలు

తుఫాను బాధితుల‌కు నేరుగా సాయమందించిన నిఖిల్


11 months ago తుఫాను బాధితుల‌కు నేరుగా సాయమందించిన నిఖిల్

‘తితిలీ’ తుఫాన్ శ్రీకాకుళం ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింద‌నే విషయం విదిత‌మే. తుఫాను కార‌ణంగా సామాన్య ప్రజానీకం కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. ఈ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదట రూ.50 వేలు సాయం ప్రకటించి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మొట్టమొదటిసారి హీరో నిఖిల్ సిద్ధార్థ తుఫాను ప్రభావిత ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి దగ్గరుండి మూడు వేల మందికి భోజన సదుపాయం కల్పించారు. అలాగే 2500 కిలోల రైస్, 500 దుప్పట్లు, పవర్ కట్స్‌ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ అందించారు. ప్రస్తుతం తాను శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేట గ్రామంలో ఉన్నానని.. అనంతరం తాను పల్లిసారధి గ్రామానికి వెళతాన‌ని నిఖిల్ తెలిపాడు. నిఖిల్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి సాయమందించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.