సినిమా వార్తలు

నిఖిల్ కొత్త చిత్రం శ్వాస


11 months ago నిఖిల్ కొత్త చిత్రం శ్వాస

ప్రస్తుతం 'ముద్ర' సినిమా చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిషన్ కట్టా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నివేదా థామస్ కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'శ్వాస' అనే టైటిల్ నిర్ణయించారు. తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను హైదరాబాదు అన్నపూర్ణా స్థూడియోలో నిర్వహించారు. ఇదే సమయంలో చిత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను కూడా సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు రిలీజ్ చేశారు. 'ముద్ర' పూర్తికాగానే ఈ 'శ్వాస' షూటింగులో నిఖిల్ షూటింగ్ లో పాల్గొననున్నారు.