సినిమా వార్తలు

నిహారిక 'సూర్యకాంతం' ఫస్టులుక్ ఇదే!


9 months ago నిహారిక 'సూర్యకాంతం' ఫస్టులుక్ ఇదే!

'ఒక మనసు' ప్రేమకథా చిత్రంతో ఇండ‌స్ట్రీకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్  లోను న‌టించింది. అయితే ఈ సినిమా అంత‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా 'సూర్యకాంతం నిర్మిత‌మ‌వుతోంది. రాహుల్ విజయ్ జోడీగా ఆమె ఈ సినిమాలో న‌టిస్తోంది. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న‌ ఈ సినిమాకు ప్రణీత్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా నాయకా నాయికల ఫస్టులుక్ ను విడుద‌ల చేశారు. కథానాయకుడిని ఆరాధన‌గా  చూస్తూ .. ఆ తరువాత ఆయనని టార్చర్ పెడుతూ ఈ పోస్టర్లో నిహారిక అల‌రిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఆసక్తికరమైన టైటిల్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ ద‌క్కుతుందేమో చూడాలి