సినిమా వార్తలు

‘సైరా’లో నిహారిక క్యారెక్టర్ ఇదే!


8 months ago ‘సైరా’లో నిహారిక క్యారెక్టర్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ‘ఖైది నెం 150’లో భాగస్వామ్యం కావాలని చాలామంది మెగా వారసులు భావించారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం రామ్‌చ‌ర‌ణ్‌కి మాత్రమే ద‌క్కింది. `సైరా`లోనూ అలాంటి పోటీ ఎదురుకాగా, ఈసారి ఛాన్స్ నిహారిక దక్కించుకుంది. ‘సైరా’లో ఆమె ఓ కీల‌క పాత్రలో కనిపించనుంది. అది చిన్న పాత్రే అయినా త‌న పాత్ర‌కు ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని అంటున్నారు. ఈ పాత్ర గురించిన వివ‌రాలను చిత్ర‌బృందం బ‌య‌ట‌కు పొక్కనివ్వడంలేదు. నిహారిక కూడా త‌న పాత్ర ఏమిట‌న్న‌ది ర‌హ‌స్యంగానే ఉంచింది. అయితే నిహారిక పాత్ర గురించిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

ఇందులో నిహారిక గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది‌. బ్రిటీష్ సైన్యంపై సైరా దాడి చేస్తుంటాడు. ఈ నేపధ్యంలో సైరాని బంధించ‌డానికి బ్రిటీష్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. ఓ సంద‌ర్భంలో గిరిజ‌న తండా ద్వారా సైరా త‌ప్పించుకోవాల‌ని ప్రయత్నిస్తాడు. ఆ స‌మ‌యంలో బ్రిటీష్ సైన్యం అతన్ని చుట్టుముడుతుంది. అప్పుడే నిహారిక `సైరా`ని కాపాడుతుంది. ఈ సినిమాలో నిహారిక క‌నిపించేది ఈ ఒక్క స‌న్నివేశంలో మాత్రమేనట. అయితే. ఈ సీన్ చాలా బాగా వ‌చ్చింద‌నే టాక్‌ వినిపిస్తోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ద‌స‌రాకి విడుద‌ల చేయాలని చ‌ర‌ణ్‌ ప్లాన్ చేస్తున్నాడుట. అందుకనుగుణంగా షూటింగ్ కూడా వేగంగా సాగుతోందని తెలుస్తోంది.