సినిమా వార్తలు

7న 'నెక్స్ట్ ఏంటి'


9 months ago 7న 'నెక్స్ట్ ఏంటి'

సందీప్ కిషన్ - తమన్నా జంటగా నటించిన చిత్రం ' నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో సినిమా ఫై అంచనాలను పెంచింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంత కాలం గా హిట్ లేని సందీప్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచిచూడాలి. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కు లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ నిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి ఈ చిత్రాన్నినిర్మించారు.