సినిమా వార్తలు

బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్టు ఇదే!


7 months ago బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్టు ఇదే!

మ‌హానాయ‌కుడు సినిమా త‌ర‌వాత క్రిష్ చేయ‌బోయే ప్రాజెక్టు ఏమిట‌న్న‌ది ఇంకా స‌స్పెన్స్‌గానే ఉంది. గ‌త కొన్ని నెల‌లుగా తీర‌క లేకుండా క్రిష్‌ ఉన్నాడు. అటు మ‌ణిక‌ర్ణిక‌, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలతో బాగా బిజీ బిజీగా గడిపాడు. మ‌హానాయ‌కుడు రిలీజ్ అయిన వెంట‌నే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని క్రిష్ ఫిక్స‌య్యాడని సమాచారం. అయితే ఆ త‌దుప‌రి సినిమాలు ఎవ‌రితో చేయాలి? అనే విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చిందట. బాహుబ‌లి నిర్మాత‌లైన శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిల‌తో క్రిష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎలాంటి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కించాలి? అనే విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుదిరిందట. అయితే అంత‌కంటే ముందు క్రిష్ త‌న సొంత సంస్థ అయిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర‌వాతే.. ఆర్కా మీడియా సినిమా ఉండ‌బోతోంది. అయితే పెద్ద హీరోతో చేయాలా? లేదంటే కొత్త‌వాళ్ల‌తో ముందుకెళ్లాలా? అనే విష‌యంలో క్రిష్ ఇంకా ఓ నిర్దార‌ణ‌కు రాలేదట. త‌న ద‌గ్గ‌ర రెండు మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. క‌థ‌ని బ‌ట్టి క‌థానాయ‌కుడ్ని ఎంచుకోవ‌డం క్రిష్ శైలిగా ఉంటుంది. ఈసారీ అదే జ‌ర‌గ‌బోతోంది. త్వ‌ర‌లో క్రిష్‌సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయని తెలుస్తోంది.