సినిమా వార్తలు

బాబోయ్ ఇన్ని విమర్శలా: నాని


1 year ago బాబోయ్ ఇన్ని విమర్శలా: నాని

సంవ‌త్స‌రానికి మూడు సినిమాలు చేసిన‌ప్పుడు కూడా ఎదుర్కోని ఒత్తిడిని, గ‌త మూడు నెల‌ల కాలంలో ఎదుర్కొన్నాన‌ని నేచుర‌ల్ స్టార్ నాని చెప్పాడు. `బిగ్‌బాస్‌` షో కోసం నాని తొలిసారి వ్యాఖ్యాత‌గా మారారు. ఇటీవ‌లె `బిగ్‌బాస్` రెండో సీజ‌న్ పూర్త‌యింది. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం ద్వారా తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి నాని జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ``బిగ్‌బాస్‌` కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించకముందు నేను ఓ చిన్న ప్ర‌పంచంలో బ‌తికేవాడిని. కానీ, ఈ కార్య‌క్ర‌మం నాకు నిజ‌మైన ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసింది. ప్ర‌పంచంలో మంచివాళ్ల‌తో పాటు అన్ని ర‌కాల మ‌నుషులూ ఉంటార‌ని అర్థ‌మైంది. జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోలేదు. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రినీ మెప్పించ‌లేమ‌ని ఈ కార్య‌క్ర‌మం ద్వారా అర్థ‌మైంది. గ‌త మూడు నెల‌ల్లో నేను చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ఏడాదికి మూడు సినిమాలు చేసిన‌పుడు కూడా నేను ఇంత ఒత్తిడిని ఎదుర్కోలేదు`అని నాని వివరించాడు.