సినిమా వార్తలు

త్వరలో నయనతార వివాహం?


11 months ago త్వరలో నయనతార వివాహం?

అగ్ర కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ వ్యవహారం గురించి వారు నేరుగా మీడియాకు వెల్లడించకపోయినా, ఇద్దరూ తీయించుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలను విఘ్నేష్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆయన నయన్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రాంలో విఘ్నేశ్ పంచుకున్నారు . తాజాగా ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌తో పెళ్లి గురించి ప్రశ్నించగా.. ‘నాకు తెలియదు. తెలిస్తే మీకు చెబుతా. ముందు నయనతారను, ఆ తర్వాత మా అమ్మను అడిగి చెబుతా’ అని అన్నారు. నయన్‌ పట్ల తాను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తిని కలవడం నా అదృష్టం. వ్యక్తిగతంగా ఆమె చాలా స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె చాలా బాధలు, సమస్యలు ఎదుర్కొన్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో, సమతుల్యం చేసుకోవాలో తెలుసుకున్నారు. అంత ఆత్మ విశ్వాసం మరొకరిలో ఉందా? అనే సందేహం నాకు వస్తుంటుంది. ఆమె చాలా శక్తిమంతమైన మనిషి. ఆమె అంటే నాకు చాలా గౌరవం అని అన్నారు.